జనప్రియలోకి స్వామిహ్ పెట్టుబడి
హైదరాబాద్, అక్టోబర్ 20: నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వామిహ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్-I రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన జనప్రియ నిర్మిస్తున్న సితారా లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులోకి రూ.136 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.149 కోట్లు. 8.212 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సితారా లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులో 1502 అపార్ట్‌మెంట్లు …